Mahesh Babu to Team Up With Bollywood Director Sanjay Leela Bhansali?

D News: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమాతో బిజీగా ఉన్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.

ఇదిలా ఉండగా, మహేష్ బాబు తదుపరి సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీతో మహేష్ బాబు సినిమా చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది.

భన్సాలీ తనదైన విజువల్ స్టైల్‌లో తెరకెక్కించబోయే ఓ పీరియడ్ డ్రామా కోసం మహేష్‌ను సంప్రదించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో దర్శకుడు స్వయంగా మహేష్‌ను కలిసి కథ వినిపించారని, కథ నచ్చడంతో మహేష్ కూడా ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి చూపించినట్లు సమాచారం.

అయితే, మహేష్ బాబు–సంజయ్ లీలా భన్సాలీ కాంబినేషన్‌పై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారంగా మాత్రమే ఈ వార్తను చూడాలి. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ నిజమైతే మాత్రం మహేష్ కెరీర్‌లో మరో భారీ పాన్ ఇండియా మూవీగా నిలిచే అవకాశం ఉంది.

By Avinash

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana