Srisailam Mahashivratri Brahmotsavams: Toll free for vehicles-DTv Telangana

DNews: Feb13: శ్రీశైల క్షేత్రం మహాశివరాత్రి వైభవాన్ని సంతరించుకుంది. విద్యుత్ దీపాలతో వెలిగిన శివాలయానికి స్వామి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.. శివభక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నేటి నుంచి ఈ నెల 16 వరకు శ్రీశైలం దేవస్థానం, అటవీ శాఖ టోల్ గేట్ల వద్ద వాహనదారులకు టోల్ ఫీజు చెల్లించకుండా మినహాయింపు ఇస్తున్నట్లు నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ప్రకటించారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనప్పటి నుండి నిన్నటి వరకు 2,59,050 మంది భక్తులు స్వామి అమ్మవారిని దర్శించుకున్నారని వెల్లడించారు. నంద్యాల – శ్రీశైలం మార్గంలో ప్రతి 5 నిమిషాలకు ఒక బస్సు ఉండేలా ఆర్టీసీ చర్యలు చేపట్టింది. APSRTC నుండి 1800 బస్సులు, తెలంగాణ RTC నుండి 1000 బస్సులు మరియు ఇతర ప్రాంతాల నుండి 200 బస్సులను ఏర్పాటు చేశారు.

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana