
DET:FEB 20:
మహేష్ బాబు చేతుల మీదుగా టీజర్ విడుదల:
శివరాత్రి సందర్భంగా ఏదైనా స్పెషల్ అప్డేట్ వస్తుందని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు మహేష్ బాబు ఒక సర్ప్రైజ్ ఇచ్చారు. విరాట్ కర్ణ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నాగబంధం చిత్ర టీజర్‌ను ఆయన లాంచ్ చేస్తూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.ఒక అద్భుతమైన దైవిక ప్రపంచాన్ని ఈ టీజర్ ద్వారా ఆవిష్కరించారు.
విజువల్ వండర్‌గా నాగబంధం:
టీజర్ చూస్తుంటే ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు ఒక గ్రాండ్ విజువల్ ఎక్స్పీరియన్స్ అని అర్థమవుతోంది.గ్రాఫిక్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరియు సెట్టింగ్స్ సినిమా స్థాయిని పెంచేలా ఉన్నాయి.పురాతన రహస్యాలు నాగ లోకం మరియు ఆధ్యాత్మిక అంశాల కలబోతగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది.భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
విరాట్ కర్ణ డ్యూయల్ రోల్:
ఈ సినిమాకు హీరోగా నటించడమే కాకుండా విరాట్ కర్ణ దర్శకత్వ బాధ్యతలను కూడా చేపట్టడం విశేషం.టీజర్లో ఆయన లుక్ మరియు నటన చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నాయి.ఒక వైపు పురాణ గాథలు మరోవైపు ఆధునిక కాలానికి సంబంధించిన మిస్టరీ.ఈ రెండింటినీ దర్శకుడు ఎలా ముడిపెట్టారో అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
పాన్ ఇండియా స్థాయిలో విడుదల:
నాగబంధం చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం,హిందీ,కన్నడ మరియు మలయాళ భాషల్లో పాన్ ఇండియా మూవీగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.శివరాత్రి పూట విడుదలైన ఈ టీజర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విజువల్స్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
