DArticle: Dec9: ఎన్నికల్లో ఓట్లు విలువైనవి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఓటు గెలుపు ఓటములను నిర్ణయిస్తుంది. గత సర్పంచ్ ఎన్నికలు దానికి నిదర్శనం. 2019లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చాలా మంది అభ్యర్థులు కేవలం ఒక ఓటుతోనే గెలుపు ఓటములను చవిచూశారు. ఎన్నికల ప్రచారంలో చెమటోడ్చి, చివరికి కేవలం ఒక ఓటుతో సర్పంచ్ అయ్యారు

కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం కోయపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి గెడెం ప్రీతి కేవలం ఒక ఓటుతో గెలిచారు. ఆమెకు 116 ఓట్లు రాగా, ఆమె ప్రత్యర్థి సుహాసినికి 115 ఓట్లు వచ్చాయి.

ఆదిలాబాద్ గ్రామీణ మండలం పోచార గ్రామానికి చెందిన కంది మమత తన ప్రత్యర్థి అల్లూరి వెంకటమ్మపై కేవలం ఒక ఓటుతో గెలిచారు. మమతకు 224 ఓట్లు, వెంకటమ్మకు 223 ఓట్లు వచ్చాయి.

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం రంగాపురంలో రామిడి ప్రభాకర్ రెడ్డి మరో ఓటుతో సర్పంచ్‌గా గెలిచారు. ఆయనకు 227 ఓట్లు రాగా, ఆయన ప్రత్యర్థి మర్రి ఆగమ్ రెడ్డికి 226 ఓట్లు వచ్చాయి.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం ఎల్లంబాయితండాలో పగిలిబాయి (231) తన సమీప ప్రత్యర్థి సత్యమ్మ (230)పై ఒక ఓటుతో గెలిచారు, కొల్లాపూర్ మండలం బడుగదిన్నెలో బైరపోగు సువర్ణ (249) తన సమీప ప్రత్యర్థి చెన్నమ్మ (248)పై ఒక ఓటుతో గెలిచి ఐదు సంవత్సరాలు సర్పంచ్ గా కొనసాగారు.

నిర్మల్ జిల్లా ముథోల్ మండలం బోరిగావ్ గ్రామంలో ఇద్దరు సర్పంచ్ అభ్యర్థులు ఎర్రం అమృత మరియు బాలగారి చిన్నుబాయి సమాన ఓట్లు (494) పొందారు. రీకౌంటింగ్ లో కూడా ఇదే ఫలితం వచ్చింది. దీనితో, అధికారులు నిర్వహించిన లక్కీ డ్రాలో ఎర్రం అమృత విజేతగా నిలిచారు. అదే మండలంలోని ఎడ్బిద్దండండాలో, దూమానాయక్ తన ప్రత్యర్థి బాబుపై ఒకే ఓటుతో గెలిచారు.

ఇది ఓటు విలువ. ‘నా ఒక్క ఓటు.. నేను వేసినా వేయకపోయినా తేడా ఏమిటి?’ అని ఉదాసీనంగా ఉండకండి. మీ ఒక్క ఓటు విజయాన్ని నిర్ణయించడంలో కీలకం కావచ్చు. తప్పకుండా ఓటు వేసి సమర్థులకు పట్టం కట్టండి.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana