DET:DEC 03:
ధర్మా ప్రొడక్షన్స్ నుండి మరో బిగ్ ప్రాజెక్ట్!
కొత్త తరం బాలీవుడ్ హీరోలలో ఒకరైన లక్ష్య వరుసగా పెద్ద ప్రాజెక్టులను సొంతం చేసుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాడు. ముఖ్యంగా కరణ్ జోహార్‌కు చెందిన ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో లక్ష్యకు వరుస అవకాశాలు వస్తున్నాయి.ఇటీవల అతడు నటించిన కిల్ మరియు ఆర్యన్ ఖాన్ డైరెక్షన్లో వచ్చిన ది బాడ్స్ ఆఫ్ బాలీవుడ్ మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లో లక్ష్య భాగం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

లీడ్‌ రోల్స్‌లో టైగర్,జాన్వీ,లక్ష్య:
ధర్మా ప్రొడక్షన్స్ నుండి రాబోతున్న ఈ కొత్త సినిమాకి లగ్ జా గలే అనే పేరును పరిశీలిస్తున్నారట.ఈ సినిమాలో లక్ష్యతో పాటు టైగర్ ష్రాఫ్ మరియు జాన్వీ కపూర్ ముఖ్య పాత్రల్లో నటించనున్నారు.ఈ ముగ్గురూ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకులలో అంచనాలు బాగా పెరిగాయి.ఈ సినిమాలో యాక్షన్‌తో పాటు ఎమోషన్స్ కూడా బలంగా ఉంటాయని తెలుస్తోంది.

దర్శకుడు రాజ్ మెహతా రివెంజ్ డ్రామా:
గుడ్ న్యూజ్ జగ్ జగ్ జీయో వంటి హిట్ సినిమాలను డైరెక్ట్ చేసిన రాజ్ మెహతా ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం.ఈ సినిమా ఒక రివెంజ్ డ్రామాగా ఉండబోతోందని సినీ వర్గాలు చెబుతున్నాయి.ఇందులో టైగర్ ష్రాఫ్ మరియు లక్ష్య మధ్య యాక్షన్ సీక్వెన్స్‌లు కీలకంగా ఉంటాయట.మొదట కరణ్ జోహార్ ఈ సినిమాను డైరెక్ట్ చేయాలనుకున్నా ఇప్పుడు రాజ్ మెహతా చేతుల్లోకి ఈ ప్రాజెక్ట్ వెళ్ళింది.

షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది?
ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.కానీ ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ 2025 లో మొదలయ్యే అవకాశం ఉంది.ముంబైలో 20 రోజుల పాటు మొదటి షెడ్యూల్ జరగనుందని తెలుస్తోంది.ఈ ప్రాజెక్ట్ అంతా సవ్యంగా పూర్తయితే,2026 రెండవ భాగంలో సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.