DET:DEC 20:
షణ్ముగ పాండ్యన్ యాక్షన్ పవర్:
షణ్ముగ పాండ్యన్ ఈ సినిమాలో తన యాక్షన్ సీక్వెన్స్‌లతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.ముఖ్యంగా పోరాట దృశ్యాల్లో అతని బాడీ లాంగ్వేజ్ మరియు తీవ్రత చాలా బాగుందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.కొన్ని సీన్లలో షణ్ముగ పాండ్యన్ తన తండ్రి,దివంగత నటుడు విజయ్ కాంత్ ను గుర్తుకు తెచ్చాడని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.నటుడిగా అతను మునుపటి చిత్రాల కంటే ఈ సినిమాలో మెరుగైన పరిణతిని చూపించాడని టాక్ వినిపిస్తోంది.

శరత్ కుమార్ అద్భుత ప్రదర్శన:

సీనియర్ నటుడు శరత్ కుమార్ తన అనుభవంతో ఈ సినిమాకు పెద్ద ఎసెట్‌గా నిలిచారు.కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా ఈ చిత్రంలో ఆయన కామెడీ టైమింగ్ మరియు నటన రెండూ అద్భుతంగా పండాయని ట్విట్టర్ రివ్యూలు చెబుతున్నాయి. షణ్ముగ పాండ్యన్ మరియు శరత్ కుమార్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి.వీరిద్దరి కెమిస్ట్రీ వెండితెరపై బాగా వర్కౌట్ అయ్యిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

పొన్రామ్ మార్క్ ఎంటర్‌టైన్మెంట్:

దర్శకుడు పొన్రామ్ తనదైన శైలిలో గ్రామీణ నేపథ్యం యాక్షన్ మరియు వినోదాన్ని మేళవించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఒక వాస్తవ ఘటన ఆధారంగా రూపొందించినప్పటికీ దానికి కమర్షియల్ హంగులు అద్ది ప్రేక్షకులను అలరించేలా తీర్చిదిద్దారు.సినిమా మొదటి భాగం వేగంగా సాగుతూ యాక్షన్,కామెడీతో ఆకట్టుకోగా సెకండ్ హాఫ్‌లో ఎమోషన్ మరియు డ్రామాకు ప్రాధాన్యతనిచ్చినట్లు తెలుస్తోంది.

యువన్ శంకర్ రాజా మ్యూజిక్ మ్యాజిక్:
ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం.ముఖ్యంగా కరుప్పన్ పాట మరియు నేపథ్య సంగీతం థియేటర్లలో ప్రేక్షకులకు మంచి హై ఇచ్చాయని రివ్యూలు చెబుతున్నాయి.సినిమాలోని యాక్షన్ సన్నివేశాలను యువన్ తన బిజిఎంతో మరింత ఎలివేట్ చేశారు.విజువల్స్ పరంగా బాలసుబ్రహ్మణ్యం సినిమాటోగ్రఫీ గ్రామీణ వాతావరణాన్ని చాలా సహజంగా చూపించింది.