
DNews: Feb 24: కేరళ రాష్ట్ర అధికారిక పేరును ‘కేరళమ్’గా మార్చేందుకు కేంద్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదం తెలిపింది. కేరళ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు. అయితే, కేరళ శాసనసభ జూన్ 24, 2024న ఏకగ్రీవంగా రాష్ట్రం పేరును కేరళ నుండి ‘కకేరళమ్’గా అధికారికంగా మార్చాలని కోరుతూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానాన్ని పరిగణనలోకి తీసుకుని, మంగళవారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో కేంద్ర ప్రభుత్వం పేరు మార్పును ఆమోదించింది.
రాష్ట్రాన్ని మలయాళంలో ‘కకేరళమ్’ అని పిలుస్తారు. వాస్తవానికి, కేరళ అసెంబ్లీ ఆగస్టు 2023లో ఇలాంటి ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపింది. అయితే, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) దానిలో కొన్ని సాంకేతిక మార్పులు చేయాలని సూచించింది. ఆ సూచనల ప్రకారం సవరణలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం, జూన్ 2024లో రెండవసారి ఈ తీర్మానాన్ని ఆమోదించి పంపింది. ఇప్పుడు చివరకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం పొందింది. ఈ ఏడాది ఏప్రిల్-మే నెలల్లో కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయంగా ప్రాధాన్యతను కలిగి ఉంది.
