DET:OCT24:
మోహన్‌లాల్‌పై ఏనుగు దంతాల కేసు:
2011లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు మోహన్‌లాల్ ఇంట్లో సోదాలు నిర్వహించినప్పుడు నాలుగు ఏనుగు దంతాలు మరియు 13 దంతాలతో చేసిన వస్తువులు లభ్యమయ్యాయి.దీంతో వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద ఆయనపై కేసు నమోదైంది.అక్రమంగా ఏనుగు దంతాలను కలిగి ఉన్నారనేది ప్రధాన అభియోగం.

సర్టిఫికెట్ల చట్టబద్ధతపై ప్రశ్న:

ఈ కేసులో తాను చట్టబద్ధంగానే ఏనుగు దంతాలను కలిగి ఉన్నానని,చనిపోయిన ఏనుగుల దంతాలను కొనుగోలు చేశానని మోహన్‌లాల్ వాదించారు.2015లో కేరళ ప్రభుత్వం ఆయనకు ఏనుగు దంతాల ఓనర్‌షిప్‌ సర్టిఫికెట్‌ యాజమాన్య ధృవపత్రం కూడా జారీ చేసింది. అయితే,ఈ సర్టిఫికెట్ల చట్టబద్ధతపై ప్రశ్నలు తలెత్తాయి.

మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ తిరస్కరణ:

ఈ కేసు నుంచి ప్రాసిక్యూషన్‌ను ఉపసంహరించుకోవాలని కోరుతూ కేరళ రాష్ట్ర ప్రభుత్వం పెరంబవూరులోని జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.కానీ,2022లో మేజిస్ట్రేట్ కోర్టు ఈ పిటిషన్‌ను తిరస్కరించింది.ఈ ఉపసంహరణ హడావుడిగా జరిగిందని,ఓనర్‌షిప్‌ సర్టిఫికెట్‌కు చట్టపరమైన ప్రామాణికత లేదని కోర్టు అభిప్రాయపడింది.

హైకోర్టులో నటుడికి ఎదురుదెబ్బ:
మేజిస్ట్రేట్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ,తనపై ప్రాసిక్యూషన్ ప్రక్రియలను కొట్టివేయాలని కోరుతూ మోహన్‌లాల్ కేరళ హైకోర్టును ఆశ్రయించారు.అయితే,2023 ఫిబ్రవరిలో హైకోర్టు మోహన్‌లాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.ప్రాసిక్యూషన్‌ను ఉపసంహరించుకునే అధికారం నిందితుడికి కాదని,ఇది ప్రభుత్వ విచక్షణాధికారం కిందకు వస్తుందని కోర్టు పేర్కొంది. అయినప్పటికీ,ఉపసంహరణ పిటిషన్‌ను మరోసారి పరిశీలించాలని మేజిస్ట్రేట్ కోర్టును ఆదేశించింది.2023 సెప్టెంబరులో హైకోర్టు, మేజిస్ట్రేట్ కోర్టులో జరుగుతున్న విచారణపై ఆరు నెలల పాటు తాత్కాలిక స్టే ఇచ్చింది.

కొనసాగుతున్న న్యాయ పోరాటం:
తాజా పరిణామాల నేపథ్యంలో,ఈ ఏనుగు దంతాల కేసులో మోహన్‌లాల్‌పై విచారణ మళ్ళీ కొనసాగే అవకాశం ఉంది.ఈ కేసులో తనకు ఊరట లభించాలని మోహన్‌లాల్ చేసిన ప్రయత్నాలకు ప్రస్తుతానికి ప్రతికూలత ఎదురైంది.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana