DNews: Dec 12: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీఆర్‌ఎస్‌ నాయకులపై తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. “ఇది కేవలం టాస్క్ మాత్రమే.. అసలు టెస్ట్ మ్యాచ్ ముందుంది” అని వ్యాఖ్యానిస్తూ ఇకపై మౌనంగా ఉండబోనని స్పష్టం చేశారు. తాను ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వస్తే, 2014 నుండి బీఆర్‌ఎస్‌ పార్టీ పాలనలో జరిగిన అన్ని విషయాలపై దర్యాప్తు చేస్తానని ప్రకటించారు. తనకు కూడా ఒక రోజు సమయం వస్తుందని, అప్పటికి నిజాలు వెలుగులోకి వస్తాయని ధైర్యంగా చెప్పారు. తాను ముఖ్యమంత్రి అవుతాననే నమ్మకం వ్యక్తం చేశారు. తనపై ఆరోపణలు చేసిన వారందరికీ లీగల్‌ నోటీసులు పంపుతానని హెచ్చరించారు. కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరాం కృష్ణారావు చేసిన ఆరోపణలపై కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన టీ న్యూస్‌ ఛానల్‌ సామాజిక మాధ్యమమా లేక శాటిలైట్‌ ఛానల్‌నా అని ప్రశ్నించారు. “మీకు గుర్తుందా?” అంటూ ఛానల్‌ యాజమాన్యాన్ని నేరుగా ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఆరోపణలు చేస్తే వాటిని పరిశీలించకూడదా అని మీడియాను ఎదుర్కొన్నారు. వారంలోపల క్షమాపణ చెప్పకపోతే కోర్టులోకి వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. తాను, తన భర్తపై భూకబ్జా ఆరోపణలు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలను అడ్డుపెట్టి దోపిడీ చేయడం తాము చేయరని స్పష్టం చేశారు. గత పది సంవత్సరాల్లో తన భర్త ఎప్పుడైనా సహాయం కోసం వచ్చారా అని బీఆర్‌ఎస్‌ నాయకులను నేరుగా ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క రూపాయి కూడా సంపాదించలేదని, అధికారంలో ఉన్నప్పుడు అవకతవకలు చేసి వాటిని తనపై నెట్టడం సరైన పద్ధతి కాదని అన్నారు. తాను అనుకున్నట్లు మాట్లాడితే శిక్ష పడుతుందని బీఆర్‌ఎస్‌ నాయకులు బెదిరిస్తున్నారని కవిత తీవ్రంగా స్పందించారు.

By Mosha

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana