D NEWS: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో సామాన్య ప్రజల ప్రాణాలకు భద్రత లేకుండా పోయిందని తెలంగాణ రక్షణ సమితి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటమేనా కాంగ్రెస్ చెబుతున్న ప్రజా పాలన అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.

ఆదిలాబాద్ రిమ్స్‌లోని SNCU వార్డులో జరిగిన అగ్నిప్రమాదంలో ఐదుగురు శిశువులు మృతి చెందిన ఘటన మరువకముందే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి SNCU వార్డులో సీలింగ్ కూలిందని కవిత పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో వార్డులో నవజాత శిశువులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అన్నారు.

వైద్య రంగానికి భారీగా నిధులు ఖర్చు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రుల పరిస్థితి అధ్వానంగా ఉందని కవిత ఆరోపించారు. అత్యవసర మందులు అందుబాటులో లేకపోవడం, వైద్యుల కొరత, పారిశుధ్య సమస్యలు, బెడ్ల కొరతతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరిస్థితులపై తమ పార్టీ ఆధారాలతో సహా ప్రజల ముందుకు వస్తుందని కవిత తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో నిలదీసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రులను తమ పార్టీ నాయకులు స్వయంగా సందర్శిస్తారని చెప్పారు.

ఈ కార్యక్రమానికి #OperationBlueCode పేరుతో కార్యాచరణ చేపడతామని కవిత ప్రకటించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించి, వాటిపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని ఆమె తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana