D NEWS: కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో చేపట్టాల్సిన ఒకరోజు అధికారిక పర్యటన చివరి నిమిషంలో రద్దయింది. అక్టోబర్ 4న మెదక్, కరీంనగర్ జిల్లాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నప్పటికీ అనివార్య కారణాలతో పర్యటన రద్దయినట్లు సమాచారం.

ముందుగా ఖరారైన షెడ్యూల్ ప్రకారం అమిత్ షా శనివారం రాత్రి 9 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉంది. అనంతరం లోక్‌భవన్‌లో బస చేసి, ఆదివారం ఉదయం నుంచి వివిధ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది.

మెదక్, కరీంనగర్ జిల్లాల్లో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో పాటు ఇతర కార్యక్రమాలకు ఆయన హాజరుకావాల్సి ఉంది. హోంమంత్రి పర్యటన నేపథ్యంలో ఆయా జిల్లాల అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు.

అయితే చివరి నిమిషంలో పర్యటన రద్దు కావడంతో బీజేపీ శ్రేణుల్లో నిరాశ నెలకొంది. పర్యటన రద్దుకు సంబంధించిన నిర్దిష్ట కారణాలను అధికారికంగా వెల్లడించలేదు. దీంతో పర్యటన ఎప్పుడు తిరిగి ఖరారవుతుందనే దానిపై ఆసక్తి నెలకొంది.

అమిత్ షా తదుపరి తెలంగాణ పర్యటనపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కొత్త షెడ్యూల్ ఖరారైన తర్వాత మెదక్, కరీంనగర్ జిల్లాల్లో ఆయన పాల్గొనాల్సిన కార్యక్రమాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana