
DET:OCT 19:
కాంతార: చాప్టర్ 1 ఘన విజయం:
నటుడు మరియు దర్శకుడు రిషబ్ శెట్టికి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన చిత్రం ‘కాంతార’ .ఈ సినిమా 2022లో విడుదలై సంచలనం సృష్టించింది. ఆ తర్వాత వచ్చిన దీనికి సంబంధించిన పీక్వెల్ ‘కాంతార: చాప్టర్ 1 Kantara: Chapter 1 కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ పీక్వెల్ అక్టోబర్ 2న 2025లో కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం మరియు ఇంగ్లీష్ భాషల్లో విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా పురాతన సంస్కృతి, దైవారాధన మరియు నమ్మకాల నేపథ్యాన్ని కలిగి ఉండడంతో, ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
ముండేశ్వరి దేవాలయ సందర్శన:
రిషబ్ శెట్టి ఇటీవల బీహార్లోని కైమూర్ జిల్లాలో ఉన్న పురాతన ముండేశ్వరి దేవి ఆలయాన్ని సందర్శించారు. ఈ ఆలయం ప్రపంచంలోనే నిరంతరంగా పూజలు అందుతున్న అత్యంత పురాతనమైన హిందూ దేవాలయాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. సినిమా విజయం సాధించిన వెంటనే రిషబ్ ఈ ఆలయాన్ని సందర్శించి, ఆలయ ఆరాధనల్లో పాల్గొన్నారు. ముండేశ్వరి మాతకు ప్రత్యేక పూజలు చేసి, ‘పట్టాభిషేకం’ అనే ఆచారంలో కూడా పాలుపంచుకున్నారు. రిషబ్ శెట్టి ఆలయంలో ప్రార్థనలు చేస్తున్న మరియు గుడి ముందు ఫోటోలు దిగిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రిషబ్ తరపున ఒక సన్నిహితుడు మాట్లాడుతూ, “ఈ గుడి ప్రపంచంలోనే పురాతనమైంది. మా ‘కాంతార’ సినిమా కూడా భారతదేశ మూల కథల్లో ఒకటిగా ఉంది. ఈ చిత్రానికి చాముండి మాతతో కూడా సంబంధం ఉంది, అందుకే రిషబ్ కృతజ్ఞతలు చెప్పడానికి ఈ ఆలయాన్ని దర్శించారు” అని తెలిపారు.
కాశీ, సిద్ధివినినాయక ఆలయాల సందర్శన:
ముండేశ్వరి దేవాలయం మాత్రమే కాక, రిషబ్ శెట్టి గతంలో కాశీ వారణాసిలోని పవిత్ర గంగా హారతిలో కూడా పాల్గొన్నారు. అలాగే, ముంబైలోని సిద్ధి వినినాయక ఆలయాన్ని కూడా దర్శించారు. ఈ పర్యటనల ద్వారా, తన చిత్రానికి లభించిన ఘన విజయాన్ని దైవ అనుగ్రహంగా భావిస్తూ, రిషబ్ శెట్టి తన భక్తిని, వినయాన్ని చాటుకున్నారు. ఈ సినిమాకు ఇంతటి ప్రేమాభిమానాలు చూపిన ప్రేక్షకులకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
