
DSports 2 Dec:క్రైస్ట్‌చర్చ్:న్యూజిలాండ్ క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ ఖాతాలో మరో అరుదైన రికార్డు వచ్చి చేరింది. వెస్టిండీస్‌తో క్రైస్ట్‌చర్చ్‌లో మంగళవారం (డిసెంబర్ 2, 2025) ప్రారంభమైన తొలి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో విలియమ్సన్ ఈ ఘనతను సాధించారు.
వెస్టిండీస్‌పై 1000 పరుగులు: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో కేన్ విలియమ్సన్ 102 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 52 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌తో విలియమ్సన్ టెస్టు క్రికెట్‌లో వెస్టిండీస్‌పై 1000 పరుగుల మైలురాయిని పూర్తి చేసుకున్నాడు.
రాస్ టేలర్ తర్వాత రెండో కివీస్ ప్లేయర్: వెస్టిండీస్ జట్టుపై టెస్ట్ క్రికెట్‌లో 1000 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు సాధించిన రెండో న్యూజిలాండ్ ఆటగాడిగా కేన్ విలియమ్సన్ రికార్డు సృష్టించారు. కేన్ విలియమ్సన్ కంటే ముందు న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ రాస్ టేలర్ (Ross Taylor) మాత్రమే ఈ ఘనత సాధించారు (1136 పరుగులు)
