DET:OCT 27:
డ్రాగన్ కోసం భారీ ప్లాన్:
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరియు దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కేజీఎఫ్,సలార్ వంటి భారీ యాక్షన్ సినిమాలను అందించిన ప్రశాంత్ నీల్,ఎన్టీఆర్‌తో కలిసి ఇంటర్నేషనల్ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి ఒక ముఖ్యమైన అప్‌డేట్ బయటికి వచ్చింది.

ఆఫ్రికా దేశం ట్యునీషియాలో షూటింగ్:

రిపోర్టుల ప్రకారం,ఈ సినిమా తదుపరి మేజర్ ఓవర్సీస్ షెడ్యూల్ ఆఫ్రికా దేశమైన ట్యునీషియాలో జరగనుంది.నవంబర్ నెలాఖరులో ఈ భారీ షెడ్యూల్‌ను ప్రారంభించడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.ఈ షెడ్యూల్ కోసం లొకేషన్ల రెక్కీ నిర్వహించడానికి దర్శకుడు ప్రశాంత్ నీల్ మరియు సాంకేతిక బృందం అక్టోబర్ 27న ట్యునీషియాకు వెళ్లనున్నట్లు సమాచారం.

కీలక యాక్షన్ సీక్వెన్స్‌ల చిత్రీకరణ:
ఈ ఆఫ్రికా షెడ్యూల్‌లో సినిమాలోని కొన్ని ముఖ్యమైన మరియు భారీ యాక్షన్ సన్నివేశాలను షూట్ చేయనున్నారట.ప్రశాంత్ నీల్ సినిమాలకు తగ్గట్టుగా అద్భుతమైన స్థాయిని,తీవ్రతను మ్యాచ్ చేసేలా ఈ యాక్షన్ సీక్వెన్స్‌లను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఆఫ్రికాకు వెళ్లే ముందు,ఎన్టీఆర్ హైదరాబాద్‌లో చిన్న,కానీ కీలకమైన షూటింగ్ షెడ్యూల్‌లో పాల్గొంటారని కూడా వార్తలు వస్తున్నాయి.మార్చి 2025లో ఈ సినిమా షూటింగ్ మొదలైన సంగతి తెలిసిందే.

స్క్రిప్ట్‌లో మార్పులు?
మధ్యలో కొంతకాలం పాటు సినిమా షూటింగ్ ఆగిపోయిందనే వార్తలు వచ్చాయి.దీనికి కారణం,షూట్ చేసిన ఫుటేజ్ పట్ల ఎన్టీఆర్ పూర్తిగా సంతృప్తి చెందకపోవడం వల్లేనని,తన స్థాయికి,ఆడియన్స్ అంచనాలకు తగ్గట్టుగా కంటెంట్ ఉండాలని కోరుతూ స్క్రిప్ట్‌లో కీలక మార్పులు చేయమని ఎన్టీఆర్ కోరారనే రిపోర్టులు ఉన్నాయి.అయితే,ఎన్టీఆర్,ప్రశాంత్ నీల్ మధ్య ఎటువంటి విభేదాలు లేవని,ఇద్దరూ కలిసి సినిమా కథాంశాన్ని,పాత్రలను మెరుగుపరచడానికి కృషి చేస్తున్నారని తెలుస్తోంది.ఈ చిత్రంలో ‘కాంతార: ఛాప్టర్ 1’నటి రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana