Janasena Formation Day: Celebrations with Giriputru-DTv Telangana

DNews: Mar14: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా నేడు జనసేన పార్టీ 12వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జిల్లా కేంద్రాలు, నియోజకవర్గాలు, మండలాలు, గ్రామ స్థాయిల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు నియోజకవర్గంలో పర్యటిస్తారు. పాడేరు మండలం వంతల మంగోడి పంచాయతీ పరిధిలోని నందిగరువు ఆదివాసి గ్రామంలో జనసేన వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను నిర్వహించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

షెడ్యూల్ ప్రకారం ఉదయం 9 గంటలకు హెలికాప్టర్‌లో పాడేరు చేరుకునే పవన్ కళ్యాణ్, ఓనూరు జంక్షన్‌లో జనసేన పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. తరువాత, ‘అడవి తల్లికి బాట’ పేరుతో నిర్మించిన రోడ్డును ఆయన ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఆయన గ్రామసభలో పాల్గొని గ్రామస్తులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలు, అవసరాలను తెలుసుకుంటారు. మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana