DET:JAN 24:
జన నాయగన్ సెన్సార్ చిక్కుముడి:
దళపతి విజయ్ రాజకీయ ప్రవేశానికి ముందు నటిస్తున్న చివరి చిత్రం జన నాయగన్ సెన్సార్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.ఈ సినిమా విడుదలకు సంబంధించి మద్రాస్ హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి.సెన్సార్ బోర్డు పెట్టిన అభ్యంతరాలపై విచారణ జరిపిన కోర్టు తుది తీర్పును జనవరి 27న వెల్లడించనుంది.విజయ్ ఫ్యాన్స్ ఈ తీర్పు కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

లిరిసిస్ట్ వైరముత్తుపై చెప్పుతో దాడి:
ప్రముఖ తమిళ సినీ గేయ రచయిత వైరముత్తుకు చేదు అనుభవం ఎదురైంది.తిరుప్పూర్‌లో జరిగిన ఒక సాహిత్య సదస్సులో పాల్గొన్న ఆయనపై ఒక మహిళ హఠాత్తుగా చెప్పు విసిరింది.అయితే అది ఆయనకు తగలలేదు.వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.ఆమె మానసిక స్థితి సరిగా లేదని ప్రాథమికంగా భావిస్తున్నప్పటికీ నిరసన తెలపడానికే ఇలా చేసిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

32 ఏళ్ల తర్వాత అదూర్ గోపాలకృష్ణన్ – మమ్ముట్టి కాంబో!

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి మరియు లెజెండరీ దర్శకుడు అదూర్ గోపాలకృష్ణన్ మళ్ళీ జతకడుతున్నారు.దాదాపు 32 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వీరిద్దరి కలయికలో సినిమా రాబోతుండటం విశేషం.గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన మథిలుకల్,విధేయన్ వంటి చిత్రాలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి.దుల్కర్ సల్మాన్ ప్రొడక్షన్ హౌస్ వేఫేరర్ ఫిల్మ్స్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రకటించింది.