
DNews: Mar11: వైఎస్ జగన్ బీజేపీతో అక్రమ పొత్తు పెట్టుకున్నారని, అందుకే ఉపాధి హామీ పథకం గురించి మాట్లాడటం లేదని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. కోనసీమ జిల్లా అమలాపురం మండలం భట్నవిల్లి వై. జంక్షన్లో మంగళవారం ఉపాధి హామీ రక్షణ యాత్రలో భాగంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జగన్ మూడు రాజధానుల పేరుతో ప్రజలను గందరగోళపరిచారని అన్నారు. వీబీ జీ రాంజీ చట్టాన్ని రద్దు చేయాలని, లేకుంటే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ పని చేస్తుందని అన్నారు. 150 రోజులు పని కల్పిస్తామని, దినసరి వేతనాన్ని రూ.400కు పెంచుతామని చెప్పారు. హస్తం గుర్తు ఆశీర్వదిస్తే రాజశేఖరరెడ్డి పాలనను తిరిగి తెస్తామని అన్నారు.
