
DSports 23Mar 2026:లాహోర్: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ప్రస్తుతం తీవ్ర విమర్శలు, ట్రోల్స్‌ను ఎదుర్కొంటోంది. మార్చి 26 నుంచి ప్రారంభం కావాల్సిన పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) 11వ సీజన్‌పై పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు మరియు దేశంలో ఏర్పడిన తీవ్ర ఇంధన సంక్షోభం (Fuel Crisis) నీలినీడలు కమ్మాయి. ఈ నేపథ్యంలో ఐస్‌లాండ్ క్రికెట్ బోర్డు వేసిన ఒక సెటైరికల్ ట్వీట్ సోషల్ మీడియాలో దావాగ్నిలా వ్యాపించింది.
క్రికెట్ ప్రపంచంలో తనదైన శైలిలో హాస్యం, వ్యంగ్యంతో ట్వీట్లు చేసే ఐస్‌లాండ్ క్రికెట్, ఈసారి పీఎస్ఎల్‌ను లక్ష్యంగా చేసుకుంది.”పీఎస్ఎల్ (PSL) రాబోతోంది.. ఇది మిలియన్ల మంది అభిమానులకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. అయితే PSL అంటే ఏమిటో అని మేము ఎప్పుడూ ఆశ్చర్యపోయేవాళ్లం.. ఇప్పుడు అది ‘పెట్రోల్ షార్టేజ్ లీగ్’ (Petrol Shortage League) అని మాకు అర్థమైంది.”
