Is This the Title of Suriya 47? Interesting Buzz Around ‘Scene’

D News: కోలీవుడ్ స్టార్ సూర్య నటిస్తున్న తదుపరి సినిమాపై కొత్త చర్చ మొదలైంది. ‘ఆవేశం’తో భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు జీతూ మాధవన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ‘సీన్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు.

ఈ సినిమాలో సూర్యకు జోడీగా నజ్రియా నజీమ్ నటిస్తున్నారు. ‘ప్రేమలు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైన మలయాళ నటుడు నస్లెన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. యాక్షన్‌తో పాటు కామెడీకి ప్రాధాన్యం ఉన్న ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం.

సూర్య ఇందులో ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారనే టాక్ ఇప్పటికే ఆసక్తిని పెంచుతోంది. మలయాళ సంగీత దర్శకుడు సుశిన్ శ్యామ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. దీపావళి సందర్భంగా నవంబర్ 6, 2026న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే టైటిల్‌తో పాటు విడుదల తేదీపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

‘సీన్’ అనే టైటిల్ నిజంగానే ఖరారైందా? సూర్యను జీతూ మాధవన్ ఎలాంటి పాత్రలో చూపించబోతున్నారు? అనే విషయాలపై అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆసక్తి కొనసాగనుంది.

By Avinash

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana