
D News: ఆపిల్ కొత్తగా విడుదల చేసిన iPhone 18 Pro, iPhone 18 Pro Maxకు భారత్‌లో భారీ స్పందన కనిపిస్తోంది. సెప్టెంబర్ 18న సేల్స్ ప్రారంభం కావడంతో ఢిల్లీ, ముంబై, నోయిడా, బెంగళూరు సహా పలు నగరాల్లోని ఆపిల్ స్టోర్ల ముందు కస్టమర్లు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. కొందరు స్టోర్లు తెరవకముందే, మరికొందరు రాత్రి నుంచే అక్కడికి చేరుకుని కొత్త ఐఫోన్ కోసం ఎదురుచూశారు.
భారత్‌లో iPhone 18 Pro ధర రూ.1,64,900 నుంచి ప్రారంభమవుతోంది. కొత్త సిరీస్‌లో A20 Pro చిప్, 48MP కెమెరా వంటి అప్‌గ్రేడ్స్ ఉన్నాయి.
ఇదిలా ఉంటే.. ఆపిల్ స్టోర్ల ముందు కనిపించిన భారీ క్యూలపై బాలీవుడ్ నటుడు సోనూ సూద్ స్పందించారు. క్యూలో నిల్చున్న కస్టమర్ల ఫొటోను షేర్ చేసిన ఆయన.. కొత్త ఫోన్ కోసం చూపిస్తున్న ఉత్సాహాన్ని సమాజంలో మార్పు కోసం కూడా చూపించాలని సూచించారు.
“కొత్త ఫోన్, కొత్త EMI.. కానీ పాత బిల్లులే! ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవడంతో పాటు సమాజంలో మార్పు తీసుకురావడానికి కూడా మనం ముందుకు రావాల్సిన సమయం వచ్చింది. నిజమైన అప్‌గ్రేడ్ అంటే మెరుగైన సమాజం” అంటూ సోనూ సూద్ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
