
DSports 03 Dec:రాయ్పూర్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో భాగంగా రాయ్పూర్ వేదికగా జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్లో టీమిండియా టాస్ ఓడింది.
దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా టాస్ గెలిచి, ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత జట్టు మొదట బ్యాటింగ్కు దిగనుంది.”పిచ్ పొడిగా ఉంది. రెండో ఇన్నింగ్స్లో మంచు ప్రభావం ఉండే అవకాశం ఉంది, అందుకే బౌలింగ్ ఎంచుకున్నాం. సిరీస్ను సమం చేయడానికి ఈ మ్యాచ్ మాకు చాలా కీలకం,” అని బవుమా టాస్ అనంతరం తెలిపాడు.టాస్ ఓడిపోవడంపై భారత కెప్టెన్ కేఎల్ రాహుల్ స్పందిస్తూ.. “నిజం చెప్పాలంటే, టాస్ విషయంలోనే నాకు ఎక్కువ ఒత్తిడి ఉంది. చాలా కాలంగా మేము టాస్ గెలవలేదు. నేను ప్రాక్టీస్ చేస్తున్నాను, కానీ పని చేయడం లేదు,” అని నవ్వుతూ చెప్పాడు. అయితే, గత మ్యాచ్ గెలిచిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నట్లు, మంచు ప్రభావంపై బౌలర్లకు అవగాహన ఉందని ధీమా వ్యక్తం చేశాడు.
మొదటి వన్డేలో భారత్ 17 పరుగుల తేడాతో గెలిచి సిరీస్లో 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్లోనూ విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకోవాలని రాహుల్ సేన చూస్తుండగా, దక్షిణాఫ్రికా సిరీస్ను సమం చేయాలనే పట్టుదలతో ఉంది.
