శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ గాలే వేదికగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ టెస్టుతో భారత క్రికెట్ చరిత్రలో మరో కీలక ఘట్టం నమోదైంది. ఇది భారత్ ఆడుతున్న 600వ టెస్టు మ్యాచ్ కాగా.. గాలేలో జరుగుతున్న టెస్టుల సంఖ్య 50కి చేరింది.

తుది జట్టు ఎంపికలో సర్ఫరాజ్ ఖాన్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. అతడు తుది జట్టులో చోటు దక్కించుకుంటాడని అంచనాలు ఉన్నప్పటికీ.. టీమ్ మేనేజ్‌మెంట్ ధ్రువ్ జురెల్‌కు అవకాశం ఇచ్చింది. దీంతో రిషభ్ పంత్ వికెట్ కీపర్‌గా కొనసాగనున్నాడు. జురెల్ బ్యాటింగ్ విభాగంలో అదనపు ఆప్షన్‌గా జట్టులోకి వచ్చాడు.

గాలే పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉండే అవకాశాలను పరిగణనలోకి తీసుకున్న భారత్.. ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగింది. రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్ స్పిన్ బాధ్యతలు నిర్వర్తించనుండగా.. మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ పేస్ విభాగాన్ని నడిపించనున్నారు.

ఇక శ్రీలంక జట్టులో ఆఫ్‌స్పిన్ ఆల్‌రౌండర్ కేశర నువాంత టెస్టుల్లో అరంగేట్రం చేస్తున్నాడు. ఇప్పటివరకు అతడు 15 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. కొలంబోలోని ఎన్‌సీసీలో జరిగిన టూర్ మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసిన నువాంత.. గాలేలో ఇండియా-ఏతో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు.

తుది జట్లు

భారత్:
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.

శ్రీలంక:
లాహిరు ఉదారా, నిషాన్ మదుష్క, దినేశ్ చండిమాల్, కమిందు మెండిస్, ధనంజయ డి సిల్వా (కెప్టెన్), సోనాల్ దినుష, నిరోషన్ డిక్వెల్లా (వికెట్ కీపర్), కేశర నువాంత, ప్రభాత్ జయసూర్య, లాహిరు కుమార, అసిత ఫెర్నాండో.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana