DSports:25 OCT:భారత్‌-ఆస్ట్రేలియా (India vs Australia) దేశాల మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో చివరిదైన మూడో వన్డేలో భారత జట్టు సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు అద్భుత ప్రదర్శన కనబర్చి ఆస్ట్రేలియాకు ఘోర పరాజయాన్ని రుచి చూపించారు.

ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా జట్టు 46.4 ఓవర్లలో 236 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. 237 పరుగుల సామాన్య లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియా బ్యాటింగ్‌లో ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.

ముఖ్యంగా సీనియర్‌ బ్యాటర్లు రోహిత్ శర్మ (Rohit Sharma) సెంచరీతో, విరాట్‌ కోహ్లీ (Virat Kohli) అర్ధ సెంచరీతో చెలరేగి ఆడారు. వీరిద్దరి అజేయ భాగస్వామ్యం కారణంగా భారత్‌ కేవలం 38.3 ఓవర్లలోనే ఒకే ఒక వికెట్‌ కోల్పోయి లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. ఈ విజయంతో భారత్ సిరీస్‌లో తమ పరువు నిలుపుకోగలిగింది.

కాగా, తొలి రెండు వన్డేల్లో ఆస్ట్రేలియా గెలిచినందున, ఈ మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది.

By rajesh

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana