
DNews: Dec 12: హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి ప్రాంతంలోని ఒక మైనారిటీ పాఠశాలలో చదువుతున్న పలువురు విద్యార్థులు శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గురువారం రాత్రి వారు అన్నం, పెరుగు, పప్పు తిన్న తర్వాత శుక్రవారం ఉదయం నుంచి వాంతులు చేయడం ప్రారంభించారు. దీంతో సుమారు 16 మంది విద్యార్థులను మధ్యాహ్నం కింగ్ కోటి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంతోష్‌బాబు తెలిపారు.
