DSports 28Jan 2026:దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) బుధవారం విడుదల చేసిన తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు తమ ఆధిపత్యాన్ని చాటారు. ముఖ్యంగా బ్యాటింగ్ విభాగంలో టాప్-3 లో ఇద్దరు భారత యువ ఆటగాళ్లు నిలవగా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన ఫామ్‌ను నిరూపించుకుంటూ టాప్-10 లోకి తిరిగి ప్రవేశించాడు.

  • 929 రేటింగ్ పాయింట్లతో టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నాడు.తన నిలకడైన ఆటతీరుతో 3వ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.కివీస్‌పై వరుసగా 82, 57 పరుగులతో రాణించిన స్కై, ఏకంగా 5 స్థానాలు ఎగబాకి 7వ ర్యాంకుకు చేరుకున్నాడు. టీ20 వరల్డ్‌కప్‌కు ముందు సూర్య టాప్-10 లోకి రావడం భారత జట్టుకు సానుకూల అంశం.ఇషాన్ కిషన్ (64వ ర్యాంక్), రింకూ సింగ్ (13 స్థానాలు మెరుగుపరుచుకుని 68వ ర్యాంక్) కూడా తమ స్థానాలను మెరుగుపరుచుకున్నారు.
  • టీ20 బౌలర్ల జాబితాలో నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.కివీస్‌తో జరిగిన మూడో టీ20లో మూడు వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’గా నిలిచిన బుమ్రా, 4 స్థానాలు మెరుగుపరుచుకుని 13వ ర్యాంకుకు చేరుకున్నాడు.13 స్థానాలు ఎగబాకి 19వ ర్యాంకును దక్కించుకున్నాడు.
  • ఆల్ రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా ఒక స్థానం మెరుగుపరుచుకుని 3వ ర్యాంకుకు చేరుకున్నాడు. శివమ్ దూబే కూడా 6 స్థానాలు ఎగబాకి 11వ స్థానానికి చేరుకుని ఆకట్టుకున్నాడు. టీ20 వరల్డ్‌కప్ 2026 ప్రారంభానికి కేవలం 10 రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో, టీమిండియా ఆటగాళ్లు ఈ స్థాయిలో ర్యాంకింగ్స్‌లో రాణించడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది.
పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana