
DSports Dec30 2025:ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ల మధ్య మెల్బోర్న్ వేదికగా జరిగిన యాషెస్ నాలుగో టెస్టు (బాక్సింగ్ డే టెస్ట్) పిచ్‌పై ఐసీసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కేవలం రెండు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్ పిచ్ నాణ్యతను తక్కువ చేస్తూ, ఎంసీజీ వేదికకు ఒక డీమెరిట్ పాయింట్ జరిమానా విధించింది.
- మెల్బోర్న్ టెస్టులో బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకోవడం అసాధ్యంగా మారింది. కేవలం రెండు రోజుల ఆటలోనే మొత్తం 36 వికెట్లు నేలకూలాయి.తొలి రోజు 20 వికెట్లు రెండో రోజు 16 వికెట్లు ఈ మ్యాచ్‌లో ఏ ఒక్క బ్యాటర్ కూడా అర్ధ సెంచరీ (50 పరుగులు) సాధించలేకపోయారు. ట్రావిస్ హెడ్ చేసిన 46 పరుగులే ఈ మ్యాచ్‌లో అత్యధిక స్కోరు.
- మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రోవ్ తన నివేదికలో ఎంసీజీ పిచ్ బౌలర్లకు అతిగా సహకరించిందని స్పష్టం చేశారు. ఐసీసీ మార్గదర్శకాల ప్రకారం, బ్యాటింగ్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా కేవలం బౌలర్లకు అనుకూలంగా ఉండే పిచ్‌లను ‘అన్‌సాటిస్‌ఫ్యాక్టరీ’ (సంతృప్తికరంగా లేదు) కేటగిరీ కింద పరిగణిస్తారు.”పిచ్ బౌలర్లకు విపరీతంగా అనుకూలించింది. రెండు రోజుల్లోనే 36 వికెట్లు పడటం, బ్యాటర్లు రాణించే అవకాశం లేకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నాం.” – జెఫ్ క్రోవ్, ఐసీసీ మ్యాచ్ రిఫరీ.
