
DSports 27 Nov:మెల్‌బోర్న్/పెర్త్: యాషెస్ సిరీస్‌లో (Ashes Test) భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య పెర్త్ స్టేడియంలో జరిగిన మొదటి టెస్ట్ కేవలం రెండు రోజుల్లోనే ముగియడంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరిగింది. అయితే, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఈ పిచ్ ప్రదర్శనపై ఏమాత్రం నిరాశ వ్యక్తం చేయకుండా, అత్యుత్తమ రేటింగ్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది.
పెర్త్ పిచ్‌కి ‘వెరీ గుడ్’ రేటింగ్ ఇవ్వడంపై భారత క్రికెట్ వర్గాల నుంచి, అభిమానుల నుంచి విమర్శలు వచ్చాయి. ఇటీవల కోల్‌కతాలో భారత్-దక్షిణాఫ్రికా మధ్య మూడు రోజుల్లో ముగిసిన టెస్ట్ పిచ్‌కి ఐసీసీ ఇంకా రేటింగ్ ఇవ్వనప్పటికీ, గతంలో భారత్‌లో జరిగిన కొన్ని టెస్ట్ పిచ్‌లకు కేవలం ‘సాటిస్ఫాక్టరీ’ (Satisfactory) రేటింగ్ మాత్రమే ఇవ్వడంపై డబుల్ స్టాండర్డ్స్ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
క్రికెట్ ఆస్ట్రేలియా స్పందన: “మ్యాచ్ రిఫరీ ‘వెరీ గుడ్’ రేటింగ్ ఇవ్వడం మా నమ్మకాన్ని నిరూపించింది. ఈ పిచ్ బ్యాట్, బంతి మధ్య సరైన బ్యాలెన్స్‌ను అందించింది. రెండు రోజులకే మ్యాచ్ ముగియడం మూడో రోజు టికెట్లు కొన్న ప్రేక్షకులకు నిరాశ కలిగించినా, ఎలైట్ పేస్ బౌలింగ్ అద్భుతమైన పోటీని అందించింది” అని క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ ఆఫ్ క్రికెట్ జేమ్స్ అల్సాప్ అన్నారు.
