
DNews: Jan 07: హైదరాబాద్ నగరంలో గ్రేటర్ RTCని ఎలక్ట్రిక్ వాహనాల (EV) జోన్‌గా మార్చేందుకు శాఖ చర్యలు తీసుకుంటోంది. పెరుగుతున్న ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని, RTC ఉన్నతాధికారులు EV ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్యను పెంచడంపై దృష్టి సారించారు. ప్రస్తుతం కాంటోన్మెంట్, మియాపూర్, రణిగంజ్, హయత్‌నగర్, HCU డిపోల్లో EV ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది డిసెంబర్ నాటికి దశలవారీగా మరో 20 బస్ డిపోల్లో EV ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కూకట్‌పల్లి డిపోలో కూడా త్వరలో EV ఛార్జింగ్ స్టేషన్ పనులు ప్రారంభం కానున్నాయి. అధికారులు తెలిపిన ప్రకారం, ప్రస్తుతం గ్రేటర్ చెన్నైలో 370 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తుండగా, వచ్చే ఫిబ్రవరి నాటికి మరో 170 ఎలక్ట్రిక్ బస్సులు రోడ్లపైకి రానున్నాయి.

