DNews : Dec 01: హైదరాబాద్ నగరంలోని ఐటీ ఉద్యోగుల విలువైన సమయం రోడ్లపైనే వృథా అవుతోంది. ఐటీ కారిడార్‌కి వచ్చే ఉద్యోగులు ట్రాఫిక్‌ జామ్‌ల కారణంగా ప్రతిరోజూ నరకయాతన అనుభవిస్తున్నారు. సోమవారం నుండి శుక్రవారం వరకు కారిడార్‌కి వెళ్లే మూడు ప్రధాన రహదారులపై పరిస్థితి ఒకేలా ఉంటుంది. ఏ మార్గం ఎంచుకున్నా ట్రాఫిక్ సమస్య తప్పదని ఉద్యోగులు చెబుతున్నారు. గంటల తరబడి వాహనాలు అంగుళం అంగుళం కదులుతూ ముందుకు సాగాల్సి వస్తోంది. రహదారుల విస్తరణ లేకపోవడం, ప్రత్యామ్నాయ అంతర్గత రహదారులు అందుబాటులో లేకపోవడం దీనికి ప్రధాన కారణాలు.

గచ్చిబౌలి ORR జంక్షన్‌ నుండి కొండాపూర్‌ వరకు పాత ముంబై హైవే, కోతగూడా–హఫీజ్‌పేట్‌ మార్గం, రాయదుర్గం బయోడైవర్సిటీ నుండి మైండ్‌స్పేస్‌ జంక్షన్‌–సైబర్‌టవర్స్‌–హైటెక్‌ సిటీ–శిల్పరామం–కేపీహెచ్‌బీ–జేఎన్‌టీయూ మార్గం, అలాగే కోతగూడా–కొండాపూర్‌ జంక్షన్‌ నుండి హైటెక్‌ జంక్షన్‌–సైబర్‌టవర్స్‌–మాధాపూర్‌–జూబ్లీహిల్స్‌ మార్గం మీదుగా ప్రయాణించే వారందరూ ట్రాఫిక్‌ నరకాన్ని అనుభవిస్తున్నారు.

ఫ్లైఓవర్లు కూడా సమస్యను తగ్గించలేకపోతున్నాయి. గచ్చిబౌలి క్రాస్‌రోడ్స్‌ వద్ద ORR వైపు, కొండాపూర్‌ వైపు నిర్మించిన ఫ్లైఓవర్ల కింద ఎప్పటికప్పుడు ట్రాఫిక్‌ జామ్‌లు జరుగుతున్నాయి. సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు వాహనాలను మళ్లించేందుకు బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తూ ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం తీవ్రంగా శ్రమిస్తున్నారు. కొండాపూర్‌–హఫీజ్‌పేట్‌ ఫ్లైఓవర్‌ వద్ద కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది.

అనధికార పార్కింగ్‌ మరో పెద్ద సమస్యగా మారింది. ఐటీ కంపెనీలు, నివాస ప్రాంతాలు, వ్యాపార సంస్థలు ప్రధాన రహదారుల వెంట విస్తరించాయి. వీటికి తగిన పార్కింగ్‌ సౌకర్యాలు లేకపోవడంతో వాహనాలు రోడ్లపైనే నిలిపేస్తున్నారు. దీంతో ట్రాఫిక్‌ మరింతగా పెరుగుతోంది. అంతేకాక GHMC, HMDAలు 30 నుండి 60 అంతస్తుల భవనాలకు అనుమతులు ఇవ్వడంతో వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగింది.

ఐటీ కారిడార్‌లో లక్షలాది ఉద్యోగులు పనిచేస్తున్నా, సరైన పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వ్యవస్థ లేదు. RTC బస్సులు పరిమితంగా ఉండటంతో ఎక్కువ మంది వ్యక్తిగత వాహనాలపైనే ఆధారపడుతున్నారు. మెట్రో రైలు సౌకర్యం హైటెక్‌ సిటీ, మైండ్‌స్పేస్‌ వరకు మాత్రమే ఉండటంతో రాయదుర్గం, కొండాపూర్‌, గచ్చిబౌలి, నానకరంగూడ, కోకాపేట్‌, పుప్పలగూడ ప్రాంతాల్లో పనిచేసే వారు తమ వాహనాలపైనే ఆధారపడుతున్నారు.

నిపుణులు పరిష్కారంగా వర్క్‌ ఫ్రం హోమ్‌ను సూచిస్తున్నారు. కరోనా సమయంలో 90 శాతం ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయడంతో ట్రాఫిక్‌ సమస్యలు కనిపించలేదు. ఆ తర్వాత ఎక్కువ కంపెనీలు వర్క్‌ ఫ్రం హోమ్‌ను రద్దు చేసి ఉద్యోగులను ఆఫీసులకు రప్పించడంతో ట్రాఫిక్‌ సమస్యలు విపరీతంగా పెరిగాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఐటీ ఉద్యోగులు ప్రభుత్వం శాశ్వత పరిష్కార చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

By Mosha

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana
పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana