DNews: Dec 03: హైదరాబాద్‌లోని సోమజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సిగ్నల్ టీవీ ఆధ్వర్యంలో “హిల్ట్ పాలసీ స్కీమ్.. స్కామ్” అనే అంశంపై జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు పరిశ్రమీకరణ వల్ల అనేక దేశాలు నష్టపోయాయని, మానవ కోణం లేకుండా జరిగే అభివృద్ధి విధ్వంసానికి దారితీస్తుందని పేర్కొన్నారు. సీనియర్ జర్నలిస్ట్ శివరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ పరిశ్రమలతోనే మానవ అభివృద్ధి జరగదని, జీవన ప్రమాణాలు మరియు మానవ విలువలు మెరుగుపడాలని అన్నారు. ప్రభుత్వానికి పరిశ్రమల విధానంపై స్పష్టత లేదని, పాశ్చాత్య అభివృద్ధి మోడల్‌పై జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉందని సూచించారు. సీనియర్ జర్నలిస్ట్ విజయ్‌కుమార్ మాట్లాడుతూ హిల్ట్ పాలసీ కింద హైదరాబాద్ చుట్టుపక్కల 9 వేల ఎకరాలు కేటాయించారని, దీనిపై పూర్తి వివరాలతో వైట్ పేపర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆయన కేంద్ర ప్రభుత్వం కూడా ఇతర నగరాలపై కుట్ర చేస్తున్నదని, చండీగఢ్‌పై జరిగిన కుట్రలాగే హైదరాబాద్‌పై కూడా దృష్టి పెట్టిందని ఆరోపించారు.

పర్యావరణవేత్త పాపారావు మాట్లాడుతూ “ఫ్యూచర్ సిటీ” ఒక పెద్ద స్కామ్ అని, సెంట్రల్ యూనివర్సిటీ భూములను కూడా స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించారని, సుప్రీంకోర్టు మందలించినా మౌనంగా ఉన్నారని విమర్శించారు. కాలుష్యం గురించి అవగాహన లేకుండా భూములను ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. MSME JAC చైర్మన్ కోటేశ్వరరావు పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి భూములు అవసరమని, ప్రభుత్వం భూములను అమ్మాలా లేదా లీజుకు ఇవ్వాలా అనే నిర్ణయం తీసుకోవాలని సూచించారు. సీనియర్ జర్నలిస్ట్ శైలేష్‌రెడ్డి దేశ రాజకీయాలు అన్నీ భూముల చుట్టూ తిరుగుతున్నాయని వ్యాఖ్యానించారు.

హిల్ట్ పాలసీని పెద్ద ఎత్తున భూముల దోపిడీగా విమర్శించారు. బక్క జడ్సన్ మాట్లాడుతూ కాంగ్రెస్ తీసుకొచ్చిన ప్రతి పాలసీ దోపిడీ కోసం మాత్రమేనని, రేవంత్‌రెడ్డి ఆలోచనలను దోచుకోవడమే లక్ష్యమని అన్నారు. రాష్ట్ర లైబ్రరీ అసోసియేషన్ మాజీ చైర్మన్ అయాచితం శ్రీధర్ మాట్లాడుతూ హిల్ట్ పాలసీపై తొందరపాటు అవసరం లేదని, ఇది నగర రూపాన్ని మార్చే విధానమని, విస్తృత చర్చ జరగాలని సూచించారు. వేల ఎకరాలు ఆక్రమించబడుతున్నప్పుడు ఎవరూ నిశ్శబ్దంగా ఉండరని అన్నారు. బీఆర్‌ఎస్ నేత చాడ వెంకటరెడ్డి ఈ విధానాన్ని విస్తృత చర్చ లేకుండా ఎలా తీసుకొచ్చారని ప్రశ్నించారు. సీనియర్ బీజేపీ నేత ప్రకాశ్‌రెడ్డి, మర్రి ప్రభాకర్, రమణ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనేక తీర్మానాలు ఆమోదించబడ్డాయి.

By Mosha

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana