DNews:15 NOV:హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ ఆర్టీవో (RTO) పరిధిలో నిర్వహించిన ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ల ఆన్‌లైన్‌ వేలం (E-Auction) మరోసారి భారీ స్థాయిలో ఆదరణ పొందింది. కేవలం ఒక్క రోజులోనే ఆర్టీఏకు రూ. 65 లక్షల 38 వేల 898 ఆదాయం సమకూరింది. ఈ వేలంలో వ్యాపారవేత్తలు, సంస్థలు తమకు నచ్చిన ప్రత్యేక నంబర్ల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేశారు. వీటిలో TG09H9999 నంబర్‌కు అత్యధికంగా రూ. 22,72,222 ధర పలికింది. ముఖ్యంగా TG09J 0009 నంబర్‌ను M/s డండు ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ. 6,80,000 చెల్లించి దక్కించుకోగా, సాయి సిల్క్స్ కలమందిర్ లిమిటెడ్‌ TG09J 0006 కోసం రూ. 5,70,666 చెల్లించింది. అదేవిధంగా TG09J 0099 నెంబర్‌ను గోదావరి ఫార్చ్యూన్‌ సంస్థ రూ. 3,40,000కు సొంతం చేసుకుంది. TG09J 0001 నంబర్‌ను శ్రీనిధి ఐటీ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.2,60,000 చెల్లించి పొందింది.TG09J 0005 నంబర్‌ను నిహారిక ఎంటర్టైన్‌మెంట్ రూ.2,40,100 చెల్లించి పొందగా, TG09J 0018 నంబర్‌ను రోహిత్ రెడ్డి ముత్తు రూ.1,71,189కు కొనుగోలు చేశారు. TG09J 0007 నంబర్‌ను కొండవరపు శ్రీనివాస్ నాయుడు రూ.1,69,002 చెల్లించి పొందారు. TG09J 0077 నంబర్‌ను మీనాక్షి పవర్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.1,41,789 చెల్లించి విజయవంతంగా బిడ్ గెలుచుకుంది. ఇక TG09J 0123 నెంబర్‌ను అకుల మాధురి రూ.1,19,999 చెల్లించి తీసుకున్నారు.అత్యంత తక్కువకు TG 09J0003 నంబర్‌ రూ. 1,15,121 పలికింది. ప్రతిసారి మాదిరిగానే ఈసారి కూడా ఈ-వేలం భారీ పోటీ మధ్య జరిగిందని, వచ్చిన ఆదాయాన్ని జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ రమేష్ ధృవీకరించారు.

By rajesh

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana