DET:NOV 07:
గ్రెమ్లిన్స్ 3 విడుదల తేదీ మరియు కొత్త రచయితలు:
వార్నర్ బ్రదర్స్ స్టూడియోస్,గ్రెమ్లిన్స్ 3 సినిమా విడుదల తేదీని ఖరారు చేసింది.ఈ సినిమా నవంబర్ 19,2027 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.ఈ వార్తతో అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు.అంతేకాకుండా,ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే రాసే బాధ్యతను ఇద్దరు ప్రముఖులు తీసుకున్నారు.జాక్ లిపోవ్‌స్కీ మరియు ఆడమ్ బి.స్టెయిన్ ఇప్పుడు క్రిస్ కొలంబస్ తో కలిసి కథను సిద్ధం చేయనున్నారు.కొలంబస్ గారే ఈ చిత్రానికి దర్శకత్వం కూడా వహిస్తున్నారు.

ఒరిజినల్ టీమ్ రీఎంట్రీ:

ఈ సినిమాపై ప్రేక్షకులకు మరింత నమ్మకం కలిగించే విషయం ఏమిటంటే, ఒరిజినల్ గ్రెమ్లిన్స్ 1984 చిత్రానికి కథ రాసిన క్రిస్ కొలంబస్,ఇప్పుడు ఈ మూడవ భాగానికి దర్శకత్వం వహించడమే కాక,కథా రచయితగా కూడా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా,ప్రముఖ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ ఈ ప్రాజెక్ట్‌కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా తిరిగి వస్తున్నారు.ఈ అనుభవజ్ఞులైన బృందం కలయిక,పాత గ్రెమ్లిన్స్ మ్యాజిక్‌ను మళ్లీ అందిస్తుందని సినీ వర్గాలు ఆశిస్తున్నాయి.

ఫ్యాన్స్‌కు అంచనాలు:

జాక్ లిపోవ్‌స్కీ మరియు ఆడమ్ బి.స్టెయిన్ గతంలో ఫైనల్ డెస్టినేషన్:
బ్లడ్‌లైన్స్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు.వీరి చేరికతో ఈ కొత్త గ్రెమ్లిన్స్ కథనంలో సరికొత్త అంశాలు, ఉత్కంఠభరితమైన సన్నివేశాలు ఉంటాయని భావిస్తున్నారు.క్రిస్ కొలంబస్ ఎప్పుడూ సి.జి.ఐ కంటే పప్పెట్లతో
పనిచేయడానికే మొగ్గు చూపుతానని గతంలో చెప్పారు.కాబట్టి,ఈసారి కూడా పాతకాలపు భయానక అనుభూతిని ప్రేక్షకులు చూడవచ్చు!ఈ సినిమా అసలు గ్రెమ్లిన్స్ కథాంశానికి కొనసాగింపా లేక కొత్త కథా?అనే దానిపై ఆసక్తి నెలకొంది.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana