D Educt: Sept 8: దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి ఇండియా పోస్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. Schedule-II, July-2026లో భాగంగా మొత్తం 23,757 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

ఈ నియామకాల ద్వారా ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM), డాక్ సేవక్ వంటి హోదాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి రాత పరీక్ష నిర్వహించకుండా, పదో తరగతిలో సాధించిన మార్కులతో రూపొందించిన మెరిట్ జాబితాను ప్రాతిపదికగా తీసుకోనున్నారు.

వేతనాల విషయానికి వస్తే.. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM) పోస్టులకు నెలకు రూ.12,000 నుంచి రూ.29,380 వరకు వేతనం లభిస్తుంది. అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM), డాక్ సేవక్ పోస్టులకు నెలకు రూ.10,000 నుంచి రూ.24,470 వరకు వేతనం అందుతుంది.

అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా పోస్టులకు ఎంపికవుతారు. ఎంపిక ప్రక్రియ పూర్తయిన అనంతరం అభ్యర్థులకు వారి ఎంపికకు సంబంధించిన సమాచారాన్ని SMS, ఈమెయిల్ లేదా పోస్టు ద్వారా తెలియజేస్తారు.

ఈ పోస్టులకు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబరు 21వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana