
DSports 28 Nov:ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో అరుదైన పరిణామం చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు ఏకంగా రెండు ప్రముఖ ఫ్రాంచైజీలు యాజమాన్యాన్ని మార్చుకోవడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గొయెంకా సోదరుడు, ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గొయెంకా తన సోషల్ మీడియా (X) వేదికగా వెల్లడించడంతో ఈ అంశం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
నవంబర్ 27న హర్ష గొయెంకా చేసిన పోస్ట్ వివరాలు:
“నేను విన్న దాని ప్రకారం, ఒకటి కాదు, రెండు ఐపీఎల్ జట్లు ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయి.. అవి RCB, RR. ప్రస్తుత మార్కెట్లో ఉన్న భారీ విలువను సొమ్ము చేసుకోవడానికి యజమానులు సిద్ధమవుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి రెండు జట్లు అమ్మకానికి, 4 నుంచి 5 మంది కొనుగోలుదారులు సిద్ధంగా ఉన్నారు! మరి విజయం సాధించే కొనుగోలుదారులు పూణె, అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు లేదా USA నుంచి వస్తారా?” అని ఆయన పేర్కొన్నారు.
