
D News: తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో విజయ్ కుటుంబానికి సంబంధించిన వార్తలపై ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. తాజాగా విజయ్ తనయుడు జాసన్ సంజయ్ తన తొలి దర్శకత్వ చిత్రం ‘సిగ్మా’ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా సేలంలో జరిగిన ఓ భారీ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సినిమా కంటే అభిమానుల సందడే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
జాసన్ సంజయ్ వేదికపైకి రాగానే భారీగా తరలివచ్చిన విజయ్ అభిమానులు ‘టీవీకే.. టీవీకే’ అంటూ నినాదాలతో ప్రాంగణాన్ని హోరెత్తించారు. విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) పేరుతో అభిమానులు కేకలు వేస్తుండటంతో కార్యక్రమం ఒక్కసారిగా మరింత ఉత్సాహంగా మారింది.
అయితే అభిమానుల నినాదాలపై జాసన్ సంజయ్ ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా ప్రశాంతంగా స్పందించారు. చిరునవ్వుతో అభిమానులను చూస్తూ థంబ్స్ అప్ చూపించారు. ఆయన రియాక్షన్‌కు అభిమానులు కూడా భారీగా స్పందించడంతో ఈ ఈవెంట్‌కు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇక ఈ సందర్భంగా తన తొలి చిత్రం ‘సిగ్మా’ గురించి జాసన్ సంజయ్ మాట్లాడారు. జీవితంలో అనుకోకుండా ఎదురయ్యే కష్టాలు, సవాళ్లను ఎదుర్కొంటూ ఓ సాధారణ వ్యక్తి సాగించే అసాధారణ ప్రయాణం చుట్టూనే సినిమా కథ ఉంటుందని తెలిపారు.
లైకా ప్రొడక్షన్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రంతో జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. విజయ్ తనయుడు కావడంతో ‘సిగ్మా’పై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అక్టోబర్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
