D Spiritual: Nov 17: అనంతపురం జిల్లా ఉరవకొండలో శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ముగింపు వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని బాబా అవతార ప్రకటన క్షేత్రంలో స్వామివారి చిన్ననాటి పాలరాతి విగ్రహానికి అభిషేకాలు, ప్రత్యేక అర్చనలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

ఏడాది క్రితం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రారంభమైన శ్రీ సత్యసాయి ప్రేమవాహిని ఐదు రథాలను ఉరవకొండ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా వైభవంగా ఊరేగించారు. రథయాత్రకు భక్తులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఉరవకొండ జాతీయ రహదారిలోని మూడు రోడ్ల కూడలి వద్ద ప్రేమవాహిని రథయాత్ర ముగింపు కార్యక్రమాన్ని ప్రముఖ అతిథులు జెండా ఊపి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థల అఖిల భారత అధ్యక్షుడు నిమిష్ పాండ్య, జాతీయ సమన్వయకర్త కోటేశ్వరరావు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. స్వామివారి ప్రేమ, సేవ, శాంతి సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ రథయాత్ర ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *