D Edct: Jul 18: అంగన్‌వాడీ సిబ్బందికి ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ‘తల్లికి వందనం’ పథకం వర్తింపు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం పరిధిని మరింత విస్తరించింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో సేవలందిస్తున్న 47,555 మంది అంగన్‌వాడీ సిబ్బందిని ఈ పథకం పరిధిలోకి తీసుకువస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నిర్ణయంతో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న అంగన్‌వాడీ ఉద్యోగుల పిల్లలకు ఏడాదికి రూ.13,000 చొప్పున ఆర్థిక సాయం అందనుంది. గతంలో అమలులో ఉన్న కొన్ని నిబంధనల కారణంగా ఈ ప్రయోజనానికి దూరమైన వేలాది మంది అంగన్‌వాడీ ఉద్యోగులకు ప్రభుత్వ తాజా నిర్ణయం ఊరటనిచ్చింది.

ఇప్పటివరకు అమలులో ఉన్న నిబంధనల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో లబ్ధిదారుల కుటుంబ నెలవారీ ఆదాయం రూ.10,000 మించకూడదు. అయితే అంగన్‌వాడీ టీచర్ల గౌరవ వేతనం ప్రస్తుతం రూ.11,500 ఉండటంతో, ఆదాయ పరిమితిని మించారనే కారణంతో వారు ఈ పథకానికి అర్హత పొందలేకపోయారు.

క్షేత్రస్థాయిలో అంగన్‌వాడీ సిబ్బంది అందిస్తున్న సేవలు, వారి కుటుంబాల పరిస్థితి, పిల్లల విద్య అవసరాలను దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం ఈ ఆదాయ పరిమితి నిబంధనలో ప్రత్యేక మినహాయింపు ఇచ్చింది. దీంతో అంగన్‌వాడీ ఉద్యోగుల పిల్లలు కూడా ‘తల్లికి వందనం’ పథకం ప్రయోజనాలను పొందే అవకాశం కల్పించింది.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై అంగన్‌వాడీ సంఘాలు, గ్రామీణ మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విద్యకు ప్రాధాన్యం ఇస్తూ అంగన్‌వాడీ ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే దిశగా ఇది కీలక నిర్ణయమని వారు అభిప్రాయపడుతున్నారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana