
DET:FEB 04:
వివాదానికి కారణమైన పాత వ్యాఖ్యలు:
గతంలో ఒక సినిమా వేడుకలో చిరంజీవి సరదాగా మాట్లాడుతూ.. తన ఇంట్లో అంతా ఆడపిల్లలే ఉన్నారని తనను తాను ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్‌గా ఫీలవుతున్నానని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా మెగా వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఒక మగబిడ్డ ఉంటే బాగుంటుందని తన కోరికను వెలిబుచ్చారు. అయితే ఇటీవల మెగా కుటుంబంలోకి రామ్ చరణ్-ఉపాసనలకు కవలలు జన్మించిన తరుణంలో కొంతమంది నెటిజన్లు చిరు పాత వ్యాఖ్యలను మళ్ళీ తెరపైకి తెచ్చి ఆయనకు లింగ వివక్షఉందని విమర్శించడం మొదలుపెట్టారు.
సోషల్ మీడియాలో ట్రోల్స్:
ఒక తమిళ జర్నలిస్ట్ మరియు మరికొందరు నెటిజన్లు చిరంజీవి వ్యాఖ్యలను తప్పుబడుతూ ట్వీట్లు చేశారు. ఆధునిక కాలంలో కూడా మగ వారసుడి కోసం ఆరాటపడటం వెనుకబడిన ఆలోచనా ధోరణి అని, ఆడపిల్లలు వారసత్వాన్ని తీసుకెళ్లలేరా? అంటూ ప్రశ్నలు సంధించారు. ఈ విమర్శలు కాస్తా ముదిరి మెగాస్టార్‌ను వ్యక్తిగతంగా దూషించే స్థాయికి వెళ్లాయి.
లావణ్య త్రిపాఠి ఘాటు స్పందన:
ఈ ట్రోల్స్‌పై చిరంజీవి చిన్న కోడలు లావణ్య త్రిపాఠి తీవ్రంగా స్పందించారు. తన మామగారిపై వస్తున్న విమర్శలను ఆమె కొట్టిపారేశారు. చిరంజీవి గారు మహిళలను ఎంతగా గౌరవిస్తారో మాకు తెలుసు. ఆయన మనస్తత్వం గురించి తెలియని వారు ఇలాంటి కామెంట్స్ చేయడం సరికాదు అని పేర్కొన్నారు.
చిరంజీవి వ్యక్తిత్వంపై ప్రశంసలు:
ముఖ్యంగా విమర్శకులకు సమాధానమిస్తూ.. ఆయన చేసే పనుల్లో కనీసం 1 శాతం కూడా మిగిలిన పురుషులు చేయలేరు. ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలియకుండా జడ్జ్ చేయడం మానుకోవాలి అని లావణ్య ఘాటుగా బదులిచ్చారు. ఆయన మనసు చాలా గొప్పదని, కేవలం ఒక సరదా సంభాషణను పట్టుకుని ఆయనకు లింగ వివక్షను ఆపాదించడం తగదని ఆమె అభిప్రాయపడ్డారు.
