DSports 22Jan 2026:నాగ్‌పూర్: మైదానంలో ఆటగాళ్ల దూకుడు సహజం, కానీ కొందరు ఆటగాళ్లు తమ ప్రవర్తనతో దిగ్గజాల మనసు గెలుచుకుంటారు. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ చేసిన ఒక పని ఇప్పుడు క్రీడా లోకంలో చర్చనీయాంశమైంది. వ్యాఖ్యాతగా ఉన్న సునీల్ గావస్కర్ సైతం అభిషేక్ సంస్కారాన్ని చూసి ముగ్ధులయ్యారు.

  • మ్యాచ్ ముగిసిన తర్వాత అవార్డుల ప్రధానోత్సవానికి వెళ్తున్న సమయంలో, మైదానంలో తన కోసం వేచి చూస్తున్న సునీల్ గావస్కర్‌ను అభిషేక్ శర్మ కలిశారు. ఆ సమయంలో అభిషేక్ నేరుగా గావస్కర్ వద్దకు వెళ్లి, ఆయన కాళ్లకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు.సాధారణంగా ఈ తరం ఆటగాళ్లు కేవలం షేక్ హ్యాండ్ ఇవ్వడానికో లేదా హగ్ చేసుకోవడానికో పరిమితమవుతారు. కానీ, భారతీయ సంప్రదాయం ప్రకారం క్రికెట్ దేవుడిగా భావించే గావస్కర్‌కు అభిషేక్ ఇచ్చిన గౌరవం అందరినీ ఆకట్టుకుంది.