
D Educt: Oct 11: దేశంలోని ఐఐటీలు సహా పలు ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్, పీహెచ్డీ కోర్సుల్లో 2027 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు పొందేందుకు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్-2027) పరీక్ష దరఖాస్తులకు ఆలస్య రుసుముతో అక్టోబరు 12 వరకు అవకాశం ఉంది.
దరఖాస్తుల్లో ఏవైనా తప్పులు ఉంటే అక్టోబరు 14 నుంచి 21వ తేదీ వరకు సరిచేసుకోవచ్చు.
గేట్-2027 పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 6, 7, 13, 14, 20, 21 తేదీల్లో నిర్వహించనున్నారు.
