DNews: Jan10: పేద బ్రాహ్మణుల కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే వారి కోసం గరుడ పథకాన్ని ప్రారంభించనుంది. రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమం, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ పథకం కింద పేద బ్రాహ్మణులు మరణిస్తే రూ. 10 వేల ఆర్థిక సహాయం అందించనున్నారు. ఈ పథకం అమలుకు సంబంధించి ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయని వెల్లడించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కె. బుచ్చిరామ్ ప్రసాద్ మంత్రి సవితను కలిశారు. ఈ సందర్భంగా గరుడ పథకం విధివిధానాలపై చర్చించారు. ఈ పథకాన్ని త్వరలో ప్రారంభిస్తామని మంత్రి సవిత వెల్లడించారు.

గరుడ పథకం కింద పేద బ్రాహ్మణులు మరణిస్తే రూ. 10 వేల ఆర్థిక సహాయం అందించనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమం, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. ఈ ఆర్థిక సహాయం కష్టకాలంలో పేద బ్రాహ్మణ కుటుంబాలకు ఉపశమనం కలిగిస్తుందని ఆయన అన్నారు. సీఎం చంద్రబాబు మొదటి నుంచి బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన అన్నారు. బ్రాహ్మణుల్లో పేదరికాన్ని నిర్మూలించడానికి 2014లో సీఎం చంద్రబాబు బ్రాహ్మణ కార్పొరేషన్‌ను స్థాపించారని మంత్రి సవిత గుర్తు చేశారు. ఆ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అనేక పథకాలు అమలు చేశామని, బ్రాహ్మణులకు ఆర్థిక భద్రత కల్పించడానికి కృషి చేశామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమం, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత వెల్లడించారు.

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana