DET:DEC 27:
సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న మోసాలకు సామాన్యులే కాదు, సెలబ్రిటీలు కూడా బలవుతున్నారు. ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు మరియు నటుడు జి.వి. ప్రకాష్ కుమార్ ఇటీవల ఒక భావోద్వేగపూరితమైన మోసానికి గురై రూ. 20,000 కోల్పోయారు.

నమ్మించి వంచించిన వైనం:
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ గతంలో ట్విట్టర్ లో Mom Little King అనే హ్యాండిల్‌తో ప్రసన్న సదీష్ అనే వ్యక్తి ఒక పోస్ట్ చేశాడు.అందులో తన తల్లి ఫోటోను పెట్టి ఆమె మరణించిందని తనని మరియు తన చెల్లెలిని ఎంతో కష్టపడి పెంచిందని పేర్కొన్నాడు.ఆమె అంత్యక్రియలు నిర్వహించడానికి డబ్బు లేక ఇబ్బంది పడుతున్నానంటూ జి.వి.ప్రకాష్‌ను ట్యాగ్ చేస్తూ సహాయం కోరాడు.ఒక అభిమాని పడుతున్న బాధను చూసి ప్రకాష్ చలించిపోయారు.

అసలు మోసం ఎలా జరిగింది?

డిసెంబర్ 25న ఉదయం 11 గంటలకు మొదటిసారి చేసిన అభ్యర్థనపై ప్రకాష్ స్పందించలేదు.అయితే మధ్యాహ్నం 1:59 గంటలకు సదరు వ్యక్తి మళ్ళీ సహాయం చేయమని కోరుతూ మెసేజ్ చేశాడు.అది నిజమేనని నమ్మిన జి.వి. ప్రకాష్ అతని జీపే నంబర్ అడిగి రూ.20,000 పంపించారు.ఆ ట్రాన్సాక్షన్ స్క్రీన్ షాట్‌ను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.అవతలి వ్యక్తి కృతజ్ఞతలు తెలపడంతో అంతా సవ్యంగానే ఉందని అనుకున్నారు.

బయటపడ్డ నిజం:

ప్రకాష్ ఆ స్క్రీన్ షాట్ పోస్ట్ చేసిన కొద్దిసేపటికే నెటిజన్లు అసలు నిజాన్ని బయటపెట్టారు.అది ఒక ఫేక్ అకౌంట్ అని ఆ వ్యక్తి ఇలాగే చాలా మందిని మోసం చేస్తున్నాడని నెటిజన్లు హెచ్చరించారు.ఒక యూజర్ అయితే తాను కూడా అదే వ్యక్తికి రూ 1,000 పంపి మోసపోయానని సాక్ష్యాలతో సహా తెలిపారు.దీంతో జి.వి.ప్రకాష్ మోసపోయారనే విషయం స్పష్టమైంది.

అభిమానుల స్పందన మరియు జాగ్రత్తలు:

ఈ ఘటనపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు.ప్రకాష్‌ను వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని చాలా మంది సూచించారు.సోషల్ మీడియాలో ఎవరైనా డబ్బులు అడిగితే వారు నిజంగా ఆపదలో ఉన్నారా లేదా అని నిర్ధారించుకున్న తర్వాతే సహాయం చేయాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana