
DET:MAR 11:
ఫంకీ ఓటీటీ రిలీజ్ ఎక్కడ,ఎప్పుడు స్ట్రీమింగ్ కానుంది?
ఫంకీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది.ఈ సినిమా థియేటర్లలో విడుదలైన కొన్ని వారాలకే ఓటీటీలోకి వస్తుండటంతో అటు విశ్వక్ సేన్ అభిమానులు ఇటు ఓటీటీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
స్ట్రీమింగ్ తేదీ:
తాజా సమాచారం ప్రకారం ఫంకీ చిత్రం మార్చి 13,2026 శుక్రవారం నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.సాధారణంగా నెట్‌ఫ్లిక్స్ తన ఒరిజినల్స్ మరియు కొత్త చిత్రాలను శుక్రవారం అర్థరాత్రి IST 12:00 AM నుండి అందుబాటులోకి తెస్తుంది.అదే సమయానికి ఈ చిత్రం కూడా అప్లోడ్ అయ్యే అవకాశం ఉంది.
సినిమా విశేషాలు:
ఒక విభిన్నమైన కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో విశ్వక్ సేన్ తనదైన శైలిలో యాక్టింగ్ మరియు టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. కాయదు లోహర్ నటన మరియు వారిద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాకు ప్లస్ అయ్యాయి.ఫ్యామిలీతో కలిసి హాయిగా నవ్వుకునే విధంగా ఈ సినిమాను దర్శకుడు రూపొందించారు.
