
DSports 26Feb 2026: పాక్ మాజీ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్ ఇటీవల తన భార్య ఆయేషా రజాక్‌తో కలిసి ఒక పాకిస్థానీ టాక్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయేషా మాట్లాడుతూ.. రజాక్ క్రికెట్ పనుల్లో బిజీగా ఉండటం వల్ల ఇంటి బాధ్యతలు, పిల్లల చదువులు, ఇతర పనులన్నీ తానే ఒక్కతే చూసుకుంటానని చెప్పారు.
- “ఆమె ఒక్కతే ఇన్ని పనులు చేస్తూ చాలా ఇబ్బంది పడుతోంది. ఆమె కష్టాన్ని నేను చూడలేకపోతున్నాను. అందుకే ఆమెపై భారం తగ్గించడానికి నేను రెండో పెళ్లి చేసుకుంటానని చాలాసార్లు ఆమెతో చెప్పాను.”రజాక్ ఈ మాట అనగానే పక్కనే ఉన్న ఆయన భార్య ఆయేషా కూడా నవ్వేశారు. దానిని ఆమె ఒక సరదా జోక్‌గా మాత్రమే తీసుకున్నారు. అయితే, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. భార్య కష్టపడుతుంటే సాయం చేయాల్సింది పోయి, ఇలాంటి జోకులు వేయడం ఏంటని కొందరు విమర్శిస్తుండగా, మరికొందరు ఇది కేవలం వినోదం కోసమే అన్నట్లుగా లైట్ తీసుకుంటున్నారు.
