DSports 6Dec: ఫుట్‌బాల్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2026 FIFA ప్రపంచ కప్ గ్రూప్ డ్రా శుక్రవారం (డిసెంబర్ 5, 2025) వాషింగ్టన్ D.C.లోని ప్రఖ్యాత కెన్నెడీ సెంటర్‌లో ఘనంగా జరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కెనడా ప్రధాని, మెక్సికో అధ్యక్షులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వేడుకలో ట్రంప్‌కు ఫిఫా తొలి ‘శాంతి బహుమతి’ని అందించడం విశేషం.

  • అర్జెంటీనా తమ టైటిల్ డిఫెన్స్‌ను అల్జీరియాతో మొదలుపెట్టనుంది. ఈ గ్రూప్‌లోని ప్రత్యర్థులు సాపేక్షంగా బలహీనంగా ఉండటంతో, మెస్సీ సేన నాకౌట్ దశకు సులభంగా చేరుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
  • FIFA చరిత్రలోనే తొలిసారిగా ఈ ప్రపంచ కప్‌లో రికార్డు స్థాయిలో 48 జట్లు పోటీపడనున్నాయి.మొత్తం జట్లను 12 గ్రూపులుగా (A నుండి L) విభజించారు.ఈ మెగా టోర్నమెంట్‌కు అమెరికా, మెక్సికో, కెనడా సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి.జూన్ 11, 2026న మెక్సికో సిటీలోని అజ్టెకా స్టేడియంలో ఆతిథ్య మెక్సికో జట్టు దక్షిణాఫ్రికాతో తలపడనుంది.ఫైనల్ మ్యాచ్ జూలై 19, 2026న న్యూజెర్సీలోని మెట్లైఫ్ స్టేడియంలో జరుగుతుంది.గ్రూప్ దశలో అగ్రస్థానం సాధించిన రెండు జట్లతో పాటు, 12 గ్రూపులలో అత్యుత్తమంగా రాణించిన ఎనిమిది మూడో స్థానంలో నిలిచిన జట్లు కూడా 32 జట్ల నాకౌట్ దశకు అర్హత సాధిస్తాయి.