DSports 30Jan 2026:న్యూఢిల్లీ: సిక్సర్ల కింగ్, టీమిండియా దిగ్గజ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తన రిటైర్మెంట్‌పై తొలిసారి మనసు విప్పి మాట్లాడారు. 2019లో తాను అంతర్జాతీయ క్రికెట్‌కు స్వస్తి పలకడానికి కేవలం ఫామ్ కోల్పోవడం మాత్రమే కారణం కాదని, జట్టులో తనకు లభించిన ట్రీట్‌మెంట్ కూడా ప్రధాన కారణమని ఆయన వెల్లడించారు.

  • సానియా మీర్జాతో జరిగిన సంభాషణలో యువరాజ్ మాట్లాడుతూ.. తన కెరీర్ చివరి దశలో ఎదుర్కొన్న మానసిక వేదనను పంచుకున్నారు.”కెరీర్ చివరి రోజుల్లో నా ఆటను నేను అస్సలు ఆస్వాదించలేకపోయాను. ఒకానొక దశలో క్రికెట్ నాకు పెద్ద భారంగా అనిపించింది. నేను ఎందుకు ఆడుతున్నానో నాకే అర్థం కాలేదు. అప్పటికే నేను దేశం కోసం ఎంతో చేశాను, ఎన్నో విజయాలు అందించాను. మళ్ళీ కొత్తగా నేను ఎవరికీ ఏమీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదనిపించింది.” అని యువీ పేర్కొన్నారు.
  • రిటైర్మెంట్‌కు దారితీసిన పరిస్థితుల గురించి చెబుతూ.. మేనేజ్‌మెంట్ వైఖరిపై యువీ అసంతృప్తి వ్యక్తం చేశారు.
  • మద్దతు కరువు: జట్టులో తనకు ఎవరి నుంచి సరైన మద్దతు లభించడం లేదని, ఒంటరినయ్యానని భావించినట్లు చెప్పారు.
  • గౌరవం దక్కలేదు: సీనియర్ ప్లేయర్‌గా తనకు దక్కాల్సిన కనీస గౌరవం కూడా దక్కలేదని, తనను ఒక ‘భారం’లా చూశారని ఆవేదన వ్యక్తం చేశారు.
  • రిలీఫ్: “ఏరోజైతే నేను క్రికెట్‌ను వదిలేశానో, ఆరోజే నేను మళ్ళీ సాధారణ స్థితికి చేరుకున్నాను. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత నా మనసు చాలా తేలికపడింది” అని ఆయన అన్నారు.
పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana