DSports 17Mar 2026:లండన్/హైదరాబాద్:ఇంగ్లాండ్ విధ్వంసకర ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ తనను జాతీయ జట్టు నుంచి తప్పించడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది కాలంగా ఇంగ్లాండ్ జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్న ఆయన, బోర్డు వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టారు. “ఒకరిద్దరి అభిప్రాయాల వల్ల నేను జట్టులో లేకపోవచ్చు, కానీ నేను అత్యుత్తమ ఆటగాడిని కాదని దాని అర్థం కాదు” అని ఆయన తెగేసి చెప్పారు.

  • తన్ను జట్టు నుంచి తప్పించిన విధానంపై లివింగ్‌స్టోన్ ఆవేదన వ్యక్తం చేశారు. హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ తనకు ఫోన్ చేసి కేవలం 60 సెకన్ల లోపే మాట్లాడి, జట్టులో చోటు లేదనే విషయాన్ని చెప్పారని వెల్లడించారు. “మేము వేరే వారిని ప్రయత్నించాలనుకుంటున్నాం” అని క్లుప్తంగా చెప్పి ఫోన్ పెట్టేశారని, అంతకు మించి ఎలాంటి వివరణ ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు.
  • ఇంగ్లాండ్ జట్టు మేనేజ్‌మెంట్‌పై విమర్శలు గుప్పిస్తూ.. “ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే.. మీరు జట్టులో ఉంటేనే మీకు విలువ ఉంటుంది. జట్టులో లేకపోతే మీ గురించి ఎవరూ పట్టించుకోరు (No-one cares about you). నేను సహాయం కోరినప్పుడు ‘నువ్వు క్రికెట్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు, కాస్త రిలాక్స్ అవ్వు’ అని సలహాలు ఇచ్చారే తప్ప, సరైన మార్గదర్శకత్వం చేయలేదు” అని లివింగ్‌స్టోన్ దుయ్యబట్టారు.