
DET:OCT23:
దీపావళి వేడుకల్లో ‘దూఆ’ ఫేస్ రివీల్!
బాలీవుడ్ స్టార్ దంపతులు దీపికా పదుకొనె, రణ్వీర్ సింగ్ ఈ దీపావళి పండుగ సందర్భంగా తమ అభిమానులకు ఒక తీపి కబురు అందించారు. తమ కూతురు దూఆ ముఖాన్ని తొలిసారిగా ప్రపంచానికి పరిచయం చేస్తూ ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. సెప్టెంబర్ 8, 2024న పుట్టిన దూఆ ముఖాన్ని ఇప్పటివరకు వీరు చూపించకుండా చాలా గోప్యత పాటించారు. అయితే, దీపావళి శుభ సందర్బంగా తమ ఆనందాన్ని పంచుకున్నారు.
రెడ్ కలర్ ట్రెడిషనల్ వేర్లో ముచ్చటైన ఫ్యామిలీ:
ఈ ఫ్యామిలీ ఫోటోల్లో దీపికా, రణ్వీర్, దూఆ సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. తల్లి దీపికాతో పాటు చిన్నారి దూఆ కూడా ఎరుపు రంగు దుస్తుల్లో ముద్దుగా కనిపించింది. తండ్రి రణ్వీర్ సింగ్ కుర్తా-పైజామాలో వారికి తోడుగా నిలిచారు. ఈ ఫోటోల్లో చిన్ని దూఆ చిరునవ్వులు చిందిస్తూ, వేలు నోట్లో పెట్టుకుని చాలా క్యూట్‌గా ఉంది. ఒక ఫోటోలో దీపికా ఒడిలో కూర్చుని దూఆ పూజలో పాల్గొనడం చూడవచ్చు.
అభిమానుల ఆనందం, శుభాకాంక్షల వెల్లువ:
ఈ పోస్ట్ చూసిన అభిమానులు, నెటిజన్లు ఆనందంతో ఉప్పొంగిపోయారు. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు నిమిషాల్లోనే వైరల్‌గా మారాయి. సెలబ్రిటీల నుండి సాధారణ ప్రజల వరకు చాలా మంది దూఆకు శుభాకాంక్షలు చెబుతూ, దీపికా-రణ్వీర్ జంటపై ప్రేమను కురిపించారు. ‘దూఆ చూడడానికి అచ్చం అమ్మానాన్నల కలయికలా ఉంది’ అని కొందరు, ‘దూఆ ముద్దుగా నవ్వుతోంది’ అని మరికొందరు కామెంట్లు చేశారు.
