Does Jagan lack the courage to speak out on Vijayamma's letter-DTv Telangana

DNews: Mar24: మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసును ప్రస్తావిస్తూ, వైసీపీ నాయకులు కావాలనే ఆస్తుల గురించి మాట్లాడుతున్నారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. తన పోరాటం, అజెండా ఆస్తుల కోసం కాదని ఆమె స్పష్టం చేశారు. జగన్ మోహన్ రెడ్డి తన ఆస్తులను కాకుండా ఇతరుల ఆస్తులను అనుభవిస్తున్నారని ఆమె విమర్శించారు. ఆస్తుల కోసం పోరాడటమే తన ఉద్దేశ్యమైతే, ఏదో ఒక సమయంలో తాను కోర్టును ఆశ్రయించేదాన్నని ఆమె స్పష్టం చేశారు.

ఆస్తి వివాదంపై తన తల్లి విజయమ్మ లేఖ ద్వారా పూర్తి స్పష్టత ఇచ్చినప్పటికీ, వైసీపీ నాయకులు అర్థరహితమైన విమర్శలు చేస్తున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ లేఖపై సంతకం చేయమని తనను బలవంతం చేశారని ఆరోపిస్తున్నారని, అది నిజమైతే ఆ సంతకం తనది కాదని విజయమ్మ స్వయంగా చెప్పి ఉండేది కదా ఆమె ప్రశ్నించారు. ఆ లేఖ నిజమని తెలిసి జగన్ మౌనంగా ఉంటూ, తన సోషల్ మీడియా సైన్యంతో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. నేరుగా మాట్లాడే దమ్ము, ధైర్యం జగన్‌కు లేవా? అని ఆమె సవాలు విసిరారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana