
D Educt: Sept 11: బ్యాంక్ ఆఫ్ బరోడా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని బ్రాంచుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన 2,482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు గడువు సెప్టెంబరు 17తో ముగియనుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు 80, తెలంగాణకు 50 పోస్టులు కేటాయించారు.
ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 వరకు బేసిక్ పేతో పాటు ఇతర అలవెన్సులు అందనున్నాయి. ఆన్‌లైన్ పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, భాషా నైపుణ్య పరీక్ష, గ్రూప్ డిస్కషన్ (జీడీ) లేదా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబరు 17లోగా బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
